అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | దశాబ్దాల పాటు చేసిన పోరాటాలను గుర్తించి కాంగ్రెస్ తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి (Telangana Thalli) విగ్రహాన్ని ఆయన మంగళవారం ఆవిష్కరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి రూపాన్ని మార్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమిట్ (Global Summit) ప్రాంగణం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్గా విగ్రహాలను ప్రారంభించారు. కాగా ప్రభుత్వం 5.8 కోట్ల వ్యయంతో 33 జిల్లాల కలెక్టరేట్లలో విగ్రహాలను ఏర్పాటు చేసింది.
CM Revanth Reddy | సోనియా గాంధీ స్ఫూర్తితో..
తెలంగాణ మలిదశ ఉద్యమంలో 2009 డిసెంబర్ 9న అప్పటి హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం మాట్లాడుతూ.. 60 ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) నెరవేర్చిందన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. కాగా ఇదే రోజు సోనియా గాంధీ జన్మదినం.. తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు, సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారని సీఎం చెప్పారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని కొనియాడారు. తమ పాలనలో సోనియా, మన్మోహన్ స్ఫూర్తి కొనసాగుతుందని చెప్పారు.
CM Revanth Reddy | అభివృద్ధి కోసం..
పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అన్నారు. 2004 ఎన్నికల సమయంలో కరీంనగర్ (Karimnagar) గడ్డ నుంచి సోనియా గాంధీ తెలంగాణ (Telangana) ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ ఏర్పాటు చేశారని తెలిపారు. తమ గుండెల్లో సోనియా గాంధీ ఉంటారని చెప్పారు.