అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎల్లారెడ్డి పట్టణంలోని (Yellareddy town) గాంధీచౌక్ వద్ద బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవతలు, హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడారన్నారు. ఆయన కూడా ఒక హిందువు అని మరిచిపోతున్నారని ఇలాంటి మాటలను మాట్లాడడానికి సిగ్గు ఉండాలని అసహనం వ్యక్తం చేశారు. కుల రాజకీయాలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని వారు హితవు పలికారు.
రాబోయే రోజుల్లో ప్రజలు రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, నాయకులు బాలకిషన్, పట్టణ అధ్యక్షుడు రాజేష్, మండల అధ్యక్షుడు నర్సింలు, మాజీ పట్టణ అధ్యక్షుడు సతీష్, ఉపాధ్యక్షులు కాశీనాథ్, సత్యం, సీనియర్ నాయకులు బాలరాజు, మల్లయ్య, యువ నాయకులు శివ, పులి రమేష్, హరీనాథ్, దళిత మోర్చా పండరి, ఐటీసెల్ గజనాన్ పాల్గొన్నారు.
