అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్ (Hyderabad)లో అరుదైన క్రీడా వేడుకకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్ల మధ్య జరిగే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ పూర్తిగా ఫ్రెండ్లీ గేమ్‌గా నిర్వహించబడుతున్నప్పటికీ, స్టేడియం మరియు అభిమానుల్లో క్రేజ్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో కనిపిస్తోంది.
CM Revanth Reddy | మెస్సీ జెర్సీ నెంబర్ 10 – రేవంత్ రెడ్డి నెంబర్ 9
ఈ మ్యాచ్‌కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం ఇద్దరు నాయకుల జెర్సీ నంబర్లు. మెస్సీ తన సాంప్రదాయ జెర్సీ నెంబర్ 10 తో మైదానంలోకి దిగనుండగా, సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ నెంబర్ 9 ను ధరించి బరిలోకి దిగుతారు. ట్రైనింగ్ సెషన్లలో పాల్గొంటూ, తన బృందంతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పట్ల ప్రేమను మరోసారి చాటుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేలాది మంది ప్రేక్షకులు హాజరవుతారని, టికెట్ల కోసం ఇప్పటికే భారీ డిమాండ్ నెలకొన్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈవెంట్‌ను క్రీడా ప్రోత్సాహానికి, అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ టూరిజంకి ఉపయోగపడే విధంగా ప్లాన్ చేస్తోంది.
రాజకీయ నాయకుడు vs ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఐకాన్ మధ్య జరిగే ఈ అరుదైన పోటీపై సోషల్ మీడియాలో ఇప్పటికే బిగ్ బజ్ క్రియేట్ అయింది. అభిమానులు ఈ మ్యాచ్‌ను చూడటానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 13న ఉప్పల్ మైదానం కచ్చితంగా క్రీడాభిమానులకు పండుగ వాతావరణాన్ని అందించనుంది. మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో శుక్రవారం(నవంబర్ 28) నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ మ్యాచ్ టికెట్ల ధరలు రూ. 1700 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈవెంట్‌కి ప్రపంచ ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీతో పాటు భారత క్రికెట్ స్టార్‌లు విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఈవెంట్ ఆర్గనైజర్లు అధికారికంగా ప్రకటించారు. మెస్సీతో కలిసి కోహ్లీ, గిల్ ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడబోతున్నారని, అభిమానులకు ఇది జీవితంలో ఒకసారి దొరికే అరుదైన అవకాశం అని నిర్వాహకులు తెలిపారు.
