ePaper
More
    HomeతెలంగాణCM Revanth | కేసీఆర్​పై మండిపడ్డ సీఎం రేవంత్​రెడ్డి

    CM Revanth | కేసీఆర్​పై మండిపడ్డ సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | బీఆర్​ఎస్​ BRS అధినేత కేసీఆర్​ KCRపై సీఎం రేవంత్​రెడ్డి  CM Revanth Reddy ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వరంగల్ Warangal లో నిర్వహించిన బీఆర్​ఎస్ BRS​ రజతోత్సవ సభలో కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ assemblyకి రాకుండా పిల్లల్ని పంపించే కేసీఆర్​కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతూ.. పనిచేయకపోతే ఎలా అని నిలదీశారు.

    కాంగ్రెస్​ పదేళ్లు అధికారంలో ఉంటుందని, కేసీఆర్​ పదేళ్లు ఫౌంహౌస్‌కే పరిమితం అవుతారని సీఎం అన్నారు. కేసీఆర్​ విద్వేషపూరిత ప్రసంగం చేసి, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. తాము ఎన్నికల హామీల అమలుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

    CM Revanth | బీఆర్​ఎస్​ సభకు సహకరించాం

    ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్​ఎస్​ సభకు తాము సహకరించినట్లు సీఎం తెలిపారు. కేసీఆర్​ కుటుంబం తెలంగాణ మీద పడి దోచుకుందన్నారు. ‘తెలంగాణ ఆగమైంది.. కాంగ్రెస్‌ విలన్‌’ అంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్రంగా మండిపడ్డారు. మరో పదేళ్లు దోచుకోవడం ఆగిందని తెలంగాణ ఆగమైందా? తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ విలన్‌ అయ్యిందా? అని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ సభకు బస్సులు ఇవ్వాలని చెప్పానని.. సభకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం గుర్తు చేశారు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...