అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Global Summit | రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం అయింది. ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భారీగా అతిథులు తరలి వచ్చారు.
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకున్నారు. సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి చిత్రపటానికి వారు నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహిస్తోంది. దీనికి 44 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు అవుతున్నారు.
Global Summit | భారీ బందోబస్తు
రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా ప్రభుత్వం సమ్మిట్ నిర్వహిస్తోంది. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు, అతిథులు హాజరు అవుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్జీటీ, టీజీఎస్సీ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ పరిసరాల్లో డ్రోన్లతో నిఘా పెట్టారు. ఔటర్ రింగ్‌రోడ్ నుంచి ప్రధాన వేదిక వరకు డ్రోన్లతో నిఘా ఉంటుంది.
Global Summit | సంతోషంగా ఉంది
గ్లోబల్ సమ్మిట్‌కు సీఎంతో పాటు సినీ నటుడు నాగర్జున (Actor Nagarjuna) సైతం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోస్‌ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ అద్భుతంగా ఉందన్నారు. ఇక్కడ ఒక ఫిలిం హబ్‌ని కూడా తయారు చేయాలని చర్చలు జరుగుతున్నాయన్నారు.
Global Summit | 27 ప్యానెల్ చర్చలు
గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజులపాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ–సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, పరిశ్రమలు, గిగ్ ఎకానమీ, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, సామాజిక సంక్షేమం వంటి రంగాలపై చర్చించనున్నారు.