అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | ఏపీ జల దోపిడీకి సీఎం రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం – నల్లమల సాగర్(Polavaram-Nallamala Sagar project)కు సహకరిస్తున్న రేవంత్ రెడ్డి నిజస్వరూపం సుప్రీంకోర్టు సాక్షిగా బయట పడిందన్నారు.
పొలవరం–నల్లమల సాగర్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని సుప్రీం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై హరీశ్‌రావు స్పందించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు (Rangareddy project) విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే, ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. ఈ మాత్రం విషయం న్యాయవాది, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి తెలియదా అని ప్రశ్నించారు. దీని కోసమే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూటు బూటు వేసుకొని ఢిల్లీ దాకా వెళ్లాలా అని ఎద్దేవా చేవారు.
Harish Rao | తెలంగాణకు ద్రోహం
మన నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. రిట్ ఉపసంహరించుకొని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని చెప్పడం అంటే, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇచ్చినట్లే అని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏండ్లు గడిచినా ముగియని కథ అన్నారు. ఈ లోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని, నీళ్లను తరలించుకు పోతుందని తెలిపారు.
తాము నిలదీస్తే బనకచర్లను అడ్డుకుంటాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం అని చెప్పిన రేవంత్ రెడ్డి, నేడు కావాలనే బలహీనమైన పిటిషన్ వేసి మోసం చేశారన్నారు. చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధం అయ్యారని ఆరోపించారు. గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు.