అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) తన సొంత నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ఇక్కడి ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కొడంగల్ శాసనసభ నియోజకవర్గం (Kodangal Legislative Assembly constituency) పరిధిలోని ఆలయాలను ఉన్నతంగా అభివృద్ధి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దౌల్తాబాద్(Daultabad)లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం(Sri Venkateswara Swamy Temple), కొడంగల్(Kodangal)లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి (బాలాజీ) ఆలయం (Mahalakshmi Venkateswara Swamy (Balaji) Temple), కోస్గీలోని శివాలయం(Shiva Temple), వేణుగోపాల స్వామి (Venugopala Swamy) ఆలయాలను సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా గొప్పగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయించారు.
CM Revanth | టీటీడీ తరహాలో అభివృద్ధికి ఆమోదం..
కొడంగల్ నియోజకవర్గం(Kodangal Legislative Assembly constituency)లోని పలు ఆలయాల అభివృద్ధి, తీసుకోవలసిన చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. కొడంగల్‌లోని చారిత్రక శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆరు ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమోదించారు.
ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లు, ముఖ్యంగా మాడ వీధులు, ప్రాకార మండపం, గర్భగుడి, భూ వరాహస్వామి దేవాలయం, మహామండప డిజైన్లలను ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు.
దీనికితోడు దౌల్తాబాద్, కోస్గి Kosgi ఆలయాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను సైతం ముఖ్యమంత్రి పరిశీలించారు. వాటికి పలు సూచనలు చేశారు. రాతి కట్టడాలతో ఆలయాలను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.