clean-shave | భర్త గడ్డం తీయట్లేదని క్లీన్ షేవ్ ఉన్న మరిదితో భార్య పరారీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: clean-shave : ఉత్తర్​ప్రదేశ్‌లో ఓ వింత ఘటన వెలుగు చూసింది. గడ్డంతో ఉండే భర్త నచ్చలేదని క్లీన్ షేవ్‌తో ఉన్న మరిదితో ఓ భార్య పారిపోయింది. మేరఠ్​లోని లిసాడి గేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భార్య చేష్టతో కలత చెందిన భర్త.. పోలీసుల సాయం కోరాడు. మేరఠ్​లోని లిసాది గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉజ్వల్ గార్డెన్ ప్రాంతంలో షకీర్ అనే వ్యక్తి తల్లి, సోదరుడితో కలిసి ఉంటున్నాడు. ఏడు నెలల క్రితం […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: clean-shave : ఉత్తర్​ప్రదేశ్‌లో ఓ వింత ఘటన వెలుగు చూసింది. గడ్డంతో ఉండే భర్త నచ్చలేదని క్లీన్ షేవ్‌తో ఉన్న మరిదితో ఓ భార్య పారిపోయింది. మేరఠ్​లోని లిసాడి గేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భార్య చేష్టతో కలత చెందిన భర్త.. పోలీసుల సాయం కోరాడు.

మేరఠ్​లోని లిసాది గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉజ్వల్ గార్డెన్ ప్రాంతంలో షకీర్ అనే వ్యక్తి తల్లి, సోదరుడితో కలిసి ఉంటున్నాడు. ఏడు నెలల క్రితం ఇంచౌలి గ్రామానికి చెందిన అర్షి అనే యువతితో షకీర్‌కు పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక తొలి రాత్రి నాడు తన భర్త ఎదుట అర్షి ఒక ప్రతిపాదన ఉంచింది. గడ్డం తీసేసి క్లీన్ షేవ్ చేసుకోమని భర్తను కోరింది.

కానీ, గడ్డం తీసుకునేందుకు షకీర్ నో చెప్పాడు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మొదటి నుంచే తాను గడ్డం పెంచుకుంటున్నాని స్పష్టం చేశాడు. గడ్డం తీయలేనని అర్షికి షకీర్‌ తేల్చి చెప్పేశాడు. కాగా, ఇదే విషయమై చాలాసార్లు భర్తతో భార్య గొడవకు దిగింది.

ఇదిలా ఉండగా.. షకీర్ ప్రతిరోజు ఉదయమే పనికి వెళ్లేవాడు. దీంతో ఇంట్లో షకీర్ తల్లి, సోదరుడు మాత్రమే ఉండేవారు. షకీర్ సోదరుడు క్లీన్ షేవ్ చేసుకుంటాడు. ఈ క్రమంలోనే షకీర్ ఇంట్లో లేని సమయంలో సదరు సోదరుడికి అర్షి చేరువైంది. అదును చూసి ఇద్దరు పారిపోయారు. కేవలం క్లీన్ షేవ్ కోసమే భార్య తనను వదిలేసి, సోదరుడితో వెళ్లిపోయిందని షకీర్ వాపోతున్నాడు. ఈ మేరకు పోలీసులు ఇరువురి మిస్సింగ్​ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...