అక్షరటుడే, వెబ్డెస్క్ : Tenth Exams | ఆంధ్రప్రదేశ్ (AP)లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎస్ఎస్సీ (SSC) బోర్డు తాజాగా వివరాలు వెల్లడించింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 6.50 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వాహణకు అధికారులు పక్కాగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొత్తం 3,500 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 35 వేల మంది ఇన్విజిలెటర్లు, సహాయక సిబ్బందిని నియమించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ (Education Department) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Tenth Exams | పరీక్షలు ఎప్పుడంటే..
మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న గణితం, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-2), ఏప్రిల్ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది.
