అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijay – Rashmika | టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారే జంటల్లో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నపేర్లు ముందుంటాయి. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి ఈ రూమర్స్ మరోసారి తెరపైకి రావడానికి కారణం మాత్రం కొంచెం భిన్నంగా ఉంది.
విజయ్ – రష్మిక కాంబినేషన్ తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గీతా గోవిందం’ (Geetha Govindam) సినిమాతోనే ఈ జంటపై డేటింగ్ వార్తలు మొదలయ్యాయి. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ లో కలిసి నటించడంతో ఆ ప్రచారం మరింత బలపడింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ కలిసి ఎక్కడ కనిపించినా, సోషల్ మీడియాలో చర్చలు షురూ కావడం సాధారణంగా మారిపోయింది. అయినప్పటికీ, తమ వ్యక్తిగత జీవితంపై ఇద్దరూ ఎప్పుడూ మౌనం పాటిస్తూ వచ్చారు.
Vijay – Rashmika | అలా క్లారిటీ వచ్చింది..
గత ఏడాది నుంచి వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే టాక్ కూడా వినిపించింది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో ఉదయపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) జరగబోతోందన్న వార్తలు అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్‌ను క్రియేట్ చేశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న ఈ రూమర్స్‌పై స్పందిస్తూ, “గత నాలుగేళ్లుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది” అంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. దీంతో పెళ్లిపై ఆమె త్వరలో ఓ నిర్ణయం చెప్పబోతుందా? లేదా మళ్లీ సైలెంట్‌గా ఉంటుందా? అనే చర్చ మొదలైంది.
ఇదే సమయంలో అనూహ్యంగా మరో పరిణామం చోటుచేసుకుంది. ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. విజయ్ – రష్మిక జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారి వివాహానికి తమ తరఫున ప్రత్యేకంగా నాణ్యమైన డచ్ గులాబీలు (Dutch Roses) పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పువ్వులు వారి వేడుకను మరింత అందంగా మార్చాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా సినీ అభిమానుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఇప్పటివరకు కేవలం రూమర్స్‌గా ఉన్న విషయం, ఇప్పుడు ఏదో నిజానికి దగ్గరగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికీ విజయ్ దేవరకొండ లేదా రష్మిక మందన్న నుంచి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.