ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGas cylinders | హోటళ్లు, రెస్టారెంట్లపై సివిల్​ సప్లయ్​ అధికారుల దాడులు.. సిలిండర్లు స్వాధీనం

    Gas cylinders | హోటళ్లు, రెస్టారెంట్లపై సివిల్​ సప్లయ్​ అధికారుల దాడులు.. సిలిండర్లు స్వాధీనం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Gas cylinders | ఇళ్లలో అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్నట్లుగా సివిల్ సప్లయ్ (Civil Supply)​ అధికారులు గుర్తించారు.

    ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు (Tiffin Centers), బేకరీలు, రెస్టారెంట్లపై (Restaurants) దాడిచేసి 53 సిలిండర్లను సీజ్ చేశారు. పలు హోటళ్లపై కేసులు నమోదు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో గృహ సంబంధ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు చేపట్టారు.

    రెండు టీంలుగా ఏర్పడి చేసిన దాడుల్లో వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న 53 సిలిండర్లను అధికారులు గుర్తించారు. సంబంధిత నిర్వాహకులపై ఎల్పీజీ కంట్రోల్ ఆర్డర్-2000 (LPG Control Order) కింద కేసులు నమెదు చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

    గృహ సంబంధ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడకూడదని, కచ్చితంగా వాణిజ్య సిలిండర్లను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా సహాయ పౌర సరఫరాల అధికారి స్వామి, డీటీలు సురేశ్, కిష్టయ్య, ఖలీద్, ఖాజా షరీఫ్, తిరుపతి పాల్గొన్నారు.

    Latest articles

    ORR | ఓఆర్​ఆర్​ సర్వీస్ ​రోడ్డుపైకి దూసుకొచ్చిన పెద్ద బండరాళ్లు.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ORR | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో నాలుగైదు రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ...

    SP Rajesh Chandra | ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | హైవేలపై రన్నింగ్ లారీలను టార్గెట్ చేసి కట్టర్లతో సీల్ ఓపెన్...

    Kamareddy | తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి.. తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో భయపడిన నాలుగేళ్ల చిన్నారి నడుచుకుంటూ బయటకు వెళ్లి...

    Kamareddy | పోక్సో కేసు నిందితుడికి 20 ఏళ్ల జైలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష...

    More like this