అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ (Nizamabad Urban constituency) అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. టీయూఎఫ్ఐడీఎస్ నిధులతో నగరంలోని పలు డివిజన్లో అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు చేస్తామన్నార. ఈ మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. డివిజన్‌కు రూ.కోటి చొప్పున నిధులతో పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ డీఈ నగేష్ రెడ్డి, ఏఈలు శివకృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.