అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | గ్రామాభివృద్ధి, సమస్యలను పరిష్కరించే మంచి వ్యక్తులను సర్పంచులుగా ఎన్నుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పని చేసే సర్పంచ్‌ను ఎన్నుకోవాలన్నారు.
రోజుకో పంచాయితీ పెట్టుకునే వ్యక్తిని గెలిపిస్తే నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎవడిని పడితే వాడిని ఎన్నుకుంటే వసూళ్లపై పడి ఉన్నదంతా గుంజుకుంటాడని హెచ్చరించారు. మంచి వాళ్లను చూసి బాధ్యత అప్పగించాలన్నారు. వరంగల్ (Warangal) జిల్లా నర్సంపేటలో సీఎం శుక్రవారం పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
CM Revanth Reddy | ఢిల్లీని ఢీకొడతా..
సీఎం మాట్లాడుతూ.. ప్రజల అండ ఉంటే ఢిల్లీనైనా ఢీకొడతానని చెప్పారు. రాష్ట్రానికి నిధులు (Funds) తీసుకొస్తానని తెలిపారు. అడగడానికి వెనుకాడదు.. రాకపోతే కొట్లాడడానికి భయపడనని స్పష్టం చేశారు. కావాల్సిన నిధులు, అనుమతుల కోసం ప్రధాని, కేంద్ర మంత్రుల వద్దకు వంద సార్లు అయినా పోతానని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తాను, అవసరమైతే కొట్లాడుతానని స్పష్టం చేశారు.
CM Revanth Reddy | వరంగల్‌ను అభివృద్ధి చేస్తా
హైదరాబాద్ (Hyderabad) నగరంలా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. నగరానిరి ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్ పోర్టు తెస్తామన్నారు. మార్చి 31లోగా పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నర్సంపేటకు మరో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగిస్తున్నానని చెప్పారు.
CM Revanth Reddy | కేటీఆర్‌పై విమర్శలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు (Jubilee Hills by-election) రిఫరెండం అన్న కేటీఆర్ మాటలను ప్రజలు బొంద పెట్టారని సీఎం విమర్శించారు. సిగ్గు లేకుండా మళ్లీ రోడ్లపై తిరుగుతూ కేటీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి వాతపెట్టాలని కోరారు. బీఆర్ఎస్కు 2023లో అధికారం పోయిందని, 2024 లోక్ సభ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దిక్కులేరని ఎద్దేవా చేశారు. నాలుగు సార్లు వీపు మీద గుద్దినా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు.
