అక్షరటుడే, వెబ్‌డెస్క్: Megastar Chiranjeevi | హైదరాబాద్ నగరానికి ఇటీవలే నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్‌ను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో ఆర్టీసీ ఎండీగా పనిచేసిన సజ్జనార్, మళ్లీ పోలీస్ యూనిఫాం ధరించగానే తనదైన శైలిలో శాంతి భద్రతల పరిరక్షణ కొనసాగిస్తున్నారు.
ఆయనతో ఉన్న అనుబంధం కారణంగా సజ్జనార్‌ను (VC Sajjanar) చిరు కలవడం జరిగిందని స్పష్టత వచ్చినా.. బాలయ్య అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. అందుకు కారణం బాలకృష్ణ-చిరంజీవి మధ్య ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు. అసెంబ్లీలో బాలయ్య.. చిరుపై కొన్ని కామెంట్స్ చేయడం, దానికి చిరు తనదైన శైలిలో స్పందించడం మనం చూశాం.
Megastar Chiranjeevi | చిరు–సజ్జనార్ భేటీకి కారణం
సైబరాబాద్ కమిషనర్‌గా (Cyberabad Commissioner) పనిచేస్తున్న సమయంలో సజ్జనార్‌తో చిరంజీవికి మంచి అనుబంధం ఏర్పడింది. కరోనా సమయంలో ప్లాస్మా దానంపై అవగాహన కల్పించేందుకు ఇద్దరూ కలిసి పనిచేశారు. అదే అనుబంధాన్ని కొనసాగిస్తూ, హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్‌కు (Sajjanar) మెగాస్టార్ వ్యక్తిగతంగా వెళ్లి అభినందనలు తెలిపినట్లు సమాచారం.
అయితే ఇటీవలే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానుల నుంచి తీవ్ర స్పందన వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చిరు–బాలయ్య అభిమానుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇలాంటి టైంలో చిరంజీవి పోలీస్ కమిషనర్‌ను కలవడం చూసి, “ఇదేం రాజకీయం?” అనే ప్రశ్నలు బాలయ్య ఫ్యాన్స్‌లో ఉత్పన్నమయ్యాయి. అయితే చిరంజీవి ఈ భేటీ పూర్తిగా వ్యక్తిగతంగా, మర్యాదపూర్వకంగానే జరిగిందని మెగా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే సజ్జనార్ తన మార్క్ పాలన మళ్లీ మొదలుపెట్టారు. ట్రాఫిక్ నియమాలు (Traffic Rule) పాటించాలన్న హెచ్చరికలతో పాటు, డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ వాడకం వంటి విషయాల్లో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి – సజ్జనార్ (Chiranjeevi-Sajjanar) భేటీ వెనుక వ్యక్తిగత అనుబంధమే కారణమని కనిపిస్తున్నప్పటికీ, ఈ సమయంలో కలవడం చర్చనీయాంశమైంది. అయినా ఈ భేటీతో పోలీసు పరిపాలనకు ప్రజా తారల మద్దతు ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. చిరు కలవడాన్ని భిన్నార్థాలుగా చూడాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు విశ్లేషకులు.