అక్షరటుడే, వెబ్డెస్క్: Chinese Manja | చైనా మాంజా ఒకరి ప్రాణం తీసుకుంది. బైక్పై వెళ్తున్న వ్యక్తి మెడకు మాంజా కోసుకోవడంతో చనిపోయాడు.
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) ఫసల్వాది గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
చైనా మాంజా తెగి ఓ వ్యక్తి చనిపోయాడు. బీహార్ (Bihar)కు చెందిన అద్వైక్ బైక్పై వెళ్తుండగా.. చైనా మాంజా గొంతు కోసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా బీహార్ నుంచి బతుకుదెరువు కోసం అద్వైక్ వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Chinese Manja | మారని ప్రజలు
చైనా మాంజాతో మనుషులు, పక్షుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. దీంతో ప్రభుత్వం నిషేధించింది. ఈ దారాన్ని ఉపయోగించవద్దని పోలీసులు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పోలీసులు పతంగుల దుకాణాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. అయినా కూడా దాని విక్రయాలు ఆగడం లేదు. ముఖ్యంగా యువత, చిన్నారులు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే చైనా మాంజా తెగి పది మంది వరకు గాయపడ్డారు. తాజాగా ఓ వ్యక్తి మరణించాడు.