24
అక్షరటుడే, బోధన్: Chinese kite string | చైనా మాంజాతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నాలేశ్వరం గ్రామానికి చెందిన మణికంఠ అనే రైతు మంగళవారం పొలానికి వెళ్లారు.
Chinese kite string | తిరిగి వస్తుండగా..
ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా చైనా మాంజా గొంతుకు తగిలి తీవ్రంగా గాయమైంది. స్థానికులు గుర్తించి వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుత పండగ రోజుల్లో చైనా మంజులతో ప్రభుత్వం ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు