అక్షరటుడే, భీమ్‌గల్: National Children’s Writers’ Conference | ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నవంబరు 30, 2025న అంతర్జాల వేదికగా “బాల సాహిత్య బేరి” పేరిట అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనం నిర్వహిస్తున్నారు.
ఈ సమ్మేళనానికి నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బాచన్‌పల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థినులు ఏ.మహేశ్వరి, ఈ.అక్షర ఎంపికయ్యారు.
Children’s Writers’ Conference |
ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పాల్గొన్న ఈ పోటీలో మొత్తం 101 మంది బాల రచయితలు ఎంపికయ్యారు. వారిలో బాచన్‌పల్లి పాఠశాల విద్యార్థినులు చోటు దక్కించుకోవడం గర్వకారణమని ప్రధానోపాధ్యాయుడు బాల గంగాధర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ సంతోషాన్ని వ్యక్తపర్చారు. వేదిక నిర్వాహకులు డాక్టర్ నరైన్ కొడాలి, సమన్వయకర్త డాక్టర్ తోటకూర ప్రసాద్, శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపారు.