Children Eyesight | పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్.. వేగంగా పెరుగుతున్న మయోపియా

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Children Eyesight | అమ్మమ్మ లేదా తాతయ్య చెప్పే కథలు, ఆటలు ఆడిస్తూ అన్నం తినిపించే రోజులు పోయాయి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, తల్లిదండ్రులు తమ పనులు చక్కబెట్టుకోవడానికి పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చి వారిని బిజీగా ఉంచుతున్నారు. క్రమేణా, ఫోన్‌ లేకుండా అన్నం తినలేని పరిస్థితికి పిల్లలు చేరుకుంటున్నారు. అతిగా ఫోన్‌ వాడకం పిల్లల కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్న వయసులోనే వారు కళ్లద్దాలు పెట్టుకోవాల్సిన దుస్థితికి దారితీస్తోంది. […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Children Eyesight | అమ్మమ్మ లేదా తాతయ్య చెప్పే కథలు, ఆటలు ఆడిస్తూ అన్నం తినిపించే రోజులు పోయాయి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, తల్లిదండ్రులు తమ పనులు చక్కబెట్టుకోవడానికి పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చి వారిని బిజీగా ఉంచుతున్నారు.

క్రమేణా, ఫోన్‌ లేకుండా అన్నం తినలేని పరిస్థితికి పిల్లలు చేరుకుంటున్నారు. అతిగా ఫోన్‌ వాడకం పిల్లల కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

చిన్న వయసులోనే వారు కళ్లద్దాలు పెట్టుకోవాల్సిన దుస్థితికి దారితీస్తోంది. పదేళ్లలోపు పిల్లల్లో కళ్లద్దాలు వాడే వారి సంఖ్య పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Children Eyesight | చూపుతో పాటు ఆలోచనా శక్తికి ముప్పు..

దూరదృష్టి లోపం: పాఠశాలల్లో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో, బోర్డుపై ఉన్న అక్షరాలను సరిగా చూడలేక, స్నేహితుడి పుస్తకంలో చూసి రాసుకుంటున్న ఒక బాలుడిని వైద్యులు గుర్తించారు.

పరీక్షల్లో అతనికి దూరదృష్టి లోపం (మయోపియా) ఉన్నట్లు తేలింది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం మొబైల్ ఫోన్ల విపరీతమైన వాడకమే.

కన్ను పెరుగుదలలో సమస్య: 8 ఏళ్ల వరకు పిల్లల్లో కన్ను (అవయవం) అభివృద్ధి చెందుతుంది. కానీ, ఫోన్‌ వెలుతురు ప్రభావం వల్ల రెటీనా దెబ్బతిని, కంటి కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది.

దీనివల్ల కంటి పరిమాణం సరిగా పెరగక, జీవితాంతం మయోపియా (దూరపు చూపు సరిగా కనిపించకపోవడం)తో బాధపడాల్సి వస్తుంది.

దృష్టి పరిమితి తగ్గిపోవడం: బయట ఆడుకుంటే 100-200 అడుగుల దూరం వరకు దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం పెరిగేది. కానీ, ఇప్పుడు ఫోన్‌ను కేవలం 30 సెంటీమీటర్ల దూరంలోనే ఉంచి చూడటం వల్ల దృష్టి కేంద్రీకరణ పరిమితి (లిమిటేషన్) తగ్గిపోతోంది.

పట్టణాల్లోనే అధికం: గ్రామాల్లోని పిల్లలకు ఆరుబయట ఆడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండటం వల్ల వారిలో పెద్దగా సమస్య లేదు. కానీ, పట్టణాల్లోని పిల్లల్లోనే దృష్టిలోపం ఎక్కువగా కనిపిస్తోంది.

అతిగా ఫోన్‌ వాడటం వల్ల పిల్లలు స్వతహాగా ఆలోచించే శక్తిని, సృజనాత్మకతను కూడా కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

తల్లిదండ్రులు గమనించాల్సినవి:

కళ్లు లాగడం, నీళ్లు కారడం, ఎరుపు, మంట, తలనొప్పి వంటి లక్షణాలతో పిల్లలను తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకువస్తున్నారు. ముఖ్యంగా 4 సంవత్సరాల లోపు పిల్లలు ఈ సమస్యలను చెప్పలేరు.

5 నుంచి 10 ఏళ్లలోపు పిల్లలు వీటిని తరచుగా చెబుతుంటారు. వారిలో సగం మందికి దృష్టిలోపం ఉంటుందని వైద్యులు అంటున్నారు.

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

మొబైల్‌ను పూర్తిగా దూరంగా ఉంచాలి. రకరకాల రంగులున్న పుస్తకాలు, ఆట వస్తువులను ఇవ్వాలి. రకరకాల రంగులున్న పుస్తకాలు, ఆట వస్తువులను ఇవ్వాలి.

ఫోన్‌ కాకుండా మరే ఇతర విషయాలపై పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారో గమనించి, ఆ దిశగా ప్రోత్సహించాలి (ఉదా: ఆటలు, నృత్యం). వీలైనంత వరకు మైదానాలకు తీసుకెళ్లి, శారీరక శ్రమ ఉండేలా చూడాలి.

పిల్లలు మారాం చేస్తున్నారని ఫోన్‌ ఇస్తున్నామని చెప్పడం కంటే, తల్లిదండ్రులు ముందుగా ఫోన్ వాడకాన్ని తగ్గించుకుని పిల్లలకు ఆదర్శంగా ఉండాలి.

చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తిస్తే వారి చూపును కాపాడవచ్చు. కాబట్టి, పిల్లలు చెప్పలేరు కాబట్టి, తల్లిదండ్రులు ముందు జాగ్రత్తగా వ్యవహరించడం అత్యవసరం.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...