అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి వివిధ రూపాల్లో చిన్నారులు ఆకట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోనె రెడ్డి సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో నెలకొల్పిన దుర్గామాత మందిరం వద్ద అమ్మవారి వివిధ అలంకరణల్లో చిన్నారులు అలరించారు. సాయంత్రం మండపం వద్ద హోమం, కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాములు అంతిరెడ్డి విజయపాల్ రెడ్డి, బాల్‌రెడ్డి, రామ్‌రెడ్డి, సాయిరెడ్డి, సాగర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.