అక్షరటుడే, ఇందూరు : Children’s Rights Day | చిన్నారుల అక్రమ రవాణా (Child Trafficking)ను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి (ACP Nagendra Chari) అన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గురువారం నగరంలోని రామకృష్ణ మఠంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం (Children’s Rights Day) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీబీ (ACB) మాట్లాడుతూ జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ హక్కు చిన్నారులకు ఉంటాయన్నారు. వాటన్నింటిని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. పిల్లలు ఎలాంటి వివక్షకు గురి కాకుండా వారి సమగ్రత అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. అనంతరం వివిధ అంశాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్బీ, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అశ్విని, డాక్టర్ రవి కిరణ్, సీడబ్ల్యూసీ సభ్యులు రాజేంద్రప్రసాద్, డీసీపీవో చైతన్య కుమార్, జీసీడీవో భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
