అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలో బాలుడి విక్రయం ఘటన కలకలం రేపింది. ఓ అజ్ఞాత వ్యక్తి 1098కు కాల్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Nizamabad City | పోలీసుల విచారణలో బట్టబయలు..
నగరంలో 1098కు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి నగరంలోని రైల్వేస్టేషన్లో (Nizamabad railway station) ఓ బాలుడికి విక్రయించారనే సమాచారాన్ని అధికారులకు అందజేశారు. దీంతో స్పందించిన చైల్డ్ వెల్ఫేర్ శాఖ అధికారి సౌజన్య వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) ఆధ్వర్యంలో సిబ్బంది రైల్వేస్టేషన్లో విచారణ చేపట్టారు.
Nizamabad City | పొంతన లేని సమాధానం..
స్టేషన్ ఆవరణలో భార్యభర్తల వద్ద ఉండాల్సిన తొమ్మిది నెలల బాలుడు కనిపించకపోవడంతో విచారించగా పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో పోలీసులు వారిరువురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.