అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ చేరుకున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (World Economic Forum) వార్షిక సదస్సు–2026లో పాల్గొనేందుకు ఆయన వెళ్లిన విషయం తెలిసిందే.
తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్ (Switzerland)లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. వీరికి విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్, ఇతర అధికారులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. దావోస్ పర్యటన (Davos Trip)లో ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy), పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్‌కు చేరుకున్నారు.
CM Revanth Reddy | పారిశ్రామికవేత్తలతో సమావేశం
నాలుగు రోజుల పాటు జరిగే సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొననుంది. తొలి రోజున వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీల పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ (Telangana Rising 2047) రోడ్‌మ్యాప్‌ను ప్రపంచ వేదికపై పరిచయం చేయనున్నారు. రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరించనున్నారు. వివిధ దేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.