అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: BC Reservation | రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగులేయడం ఒక విప్లవాత్మక నిర్ణయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నిజామాబాద్ ఓబీసీ (Telangana Pradesh Congress Nizamabad OBC) జిల్లా అధ్యక్షుడు రాజ నరేందర్ గౌడ్ అన్నారు.
శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురావాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయమని పేర్కొన్నారు. 2018 చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన సామాజిక విప్లవానికి నాంది గా అభివర్ణించారు.
BC Reservation | ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ జోడోయాత్ర..
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (AICC top leader Rahul Gandhi) భారత్ జోడో యాత్రలో (Bharath Jodo Yatra) చేసిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్‌ను దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు పర్చేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.