Homeతాజావార్తలుParking Space | పార్కింగ్​ కష్టాలకు చెక్​.. స్మార్ట్ మల్టీలెవల్ పార్కింగ్​ను ప్రారంభించనున్న జీహెచ్​ఎంసీ

Parking Space | పార్కింగ్​ కష్టాలకు చెక్​.. స్మార్ట్ మల్టీలెవల్ పార్కింగ్​ను ప్రారంభించనున్న జీహెచ్​ఎంసీ

హైదరాబాద్​ నగరంలోని కేబీఆర్​ పార్క్​లో మొట్టమొదటి స్మార్ట్ మల్టీలెవల్ పార్కింగ్‌ను శనివారం అధికారులు ప్రారంభించనున్నారు. ఇందులో 72 కార్లు, బైక్​లను పార్క్​ చేయొచ్చు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parking Space | హైదరాబాద్​ నగరంలో (Hyderabad City) ట్రాఫిక్​ రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారు. దీనికి తోడు పార్కింగ్​ సమస్య వేధిస్తోంది. ఎక్కడికైనా వెళ్లిన కార్​, బైక్​ పార్క్​ చేద్దామంటే స్థలం ఉండదు. దీంతో పలువురు రోడ్ల పక్కన పార్క్​ చేస్తుంటారు. ఫలితంగా ట్రాఫిక్​ జామ్ అవుతుంది. ఈ సమస్యలకు చెక్​ పెట్టేందుకు నగరంలో స్మార్ట్ మల్టీలెవల్ పార్కింగ్​ను (multilevel parking) జీహెచ్​ఎంసీ ప్రారంభించనుంది.

హైదరాబాద్​ నగరంలోని కేబీఆర్​ పార్క్​లో (KBR Park) మొట్టమొదటి స్మార్ట్ మల్టీలెవల్ పార్కింగ్‌ను శనివారం అధికారులు ప్రారంభించనున్నారు. ఇందులో 72 కార్లను పార్క్​ చేయవచ్చు. అలాగే బైక్​లను నిలపడానికి ప్రత్యేక స్థలం ఉటుంది. RFID-ప్రారంభించబడిన స్మార్ట్ ఎంట్రీ & ఎగ్జిట్ సౌకర్యం ఉంటుంది. ఎలక్ట్రానిక్​ వాహనాల కోసం EV ఛార్జింగ్ పాయింట్లు (EV charging points) అందుబాటులో ఉంటాయి. అధునాతన భద్రతా లక్షణాలు: లోడ్ సెన్సార్లు, ఆటో-లాకింగ్, CCTV, అత్యవసర వ్యవస్థలు ఏర్పాటు చేశారు.

Parking Space | పని వేళలు

పట్టణ స్థలాన్ని ఆదా చేసే కాంపాక్ట్ నిలువు డిజైన్​లో దీనిని ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ పార్కింగ్​ వ్యవస్థ పని చేస్తుంది. ఇది నగరంలో మొట్టమొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ వ్యవస్థ (parking system) కావడం గమనార్హం. నవ నిర్మాణ్ అసోసియేట్స్ ద్వారా PPP మోడల్ కింద దీనిని అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటైన KBR పార్క్ చుట్టూ పెరుగుతున్న రోడ్డు పక్కన రద్దీని పరిష్కరించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలను పార్క్​ చేయడానికి ఈ విధానం సహకరిస్తుంది.

Parking Space | నాంపల్లిలో సైతం

నాంపల్లిలో పార్కింగ్​ ప్రభుత్వ, ప్రైవేట్​ భాగస్వామ్యంతో 15 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. దీనిని నోవమ్ కంపెనీ నిర్మిస్తుండగా.. హైదరాబాద్​ మెట్రో రైల్​ లిమిటెడ్​ (HMRL) పర్యవేక్షిస్తోంది. ఈ భవనంలో 10 అంతస్తులను పార్కింగ్​ కోసం వినియోగించనున్నారు. ఐదు అంతస్తులను కమర్షియల్ స్పేస్​ కోసం అద్దెకు ఇస్తారు. ఈ భవనం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. త్వరలో భవనంలో పార్కింగ్​ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇలాంటి పార్కింగ్​ స్థలాలు నగరంలోని రద్దీ ప్రదేశాల్లో అందుబాటులోకి వస్తే ప్రజలకు మేలు కలగనుంది.

Must Read
Related News