అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maruti Suzuki | జీఎస్టీ సంస్కరణలతో కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. భారతదేశంలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో తనదైన ముద్రను కొనసాగిస్తోన్న మారుతి సుజుకీ వ్యాగన్‌ఆర్ (Maruti Suzuki Wagon R) ధర సైతం తగ్గింది. అధిక మైలేజీ ఇచ్చే ఈ కారు ప్రస్తుతం రూ. 5 లక్షలలోపు ధరలోనే లభిస్తోంది. దీంతో ఈ కారుకు డిమాండ్ పెరిగింది.
మారుతి సుజుకీ వ్యాగన్‌ఆర్‌ను భారతదేశంలో 1999లో ప్రవేశపెట్టారు. దేశంలోని కొన్ని హ్యాచ్‌బ్యాక్ కారు (Hatchback car) మోడళ్లలో ఒకటి. ఎస్‌యూవీలు, క్రాస్‌ఓవర్‌లు, ఎంపీవీ(MPV) యుటిలిటీ వాహనాల నుంచి భారీ ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ మోడల్ కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంది. ఇందుకు కారణం ఇది అధిక మైలేజీని ఇవ్వడమే.. ప్రస్తుతం జీఎస్టీ సంస్కరణలతో (GST Reforms) శ్లాబ్ రేట్లు మారాయి. ప్రభుత్వం కార్లపై జీఎస్టీని 28 శాతంనుంచి 18 శాతం శ్లాబ్‌లోకి మార్చింది.
దీంతో కార్ల ధరలు 10 శాతం వరకు తగ్గాయి. జీఎస్టీ 2.0తో మారుతి సుజుకీ వ్యాగన్‌ఆర్ ధర 80 వేల రూపాయల వరకు తగ్గింది. ఈ అతిపెద్ద తగ్గింపు వ్యాగన్‌ఆర్ బేస్ వేరియంట్ (LXi) పై ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ AMT వేరియంట్ ధర రూ.77 వేల వరకు తగ్గింది. మారుతి సుజుకీి వ్యాగన్‌ఆర్ పెట్రోల్, పెట్రోల్ ప్లస్ సీఎన్‌జీ ఆప్షన్స్‌లో లభిస్తోంది. పెట్రోల్ ప్లస్ సీఎన్‌జీ వేరియంట్ ధర రూ.80 వేల వరకు తగ్గింది.
మైలేజీ.. ఈ హ్యాచ్‌బ్యాక్ మాన్యువల్ వేరియంట్ (పెట్రోల్) లీటరుకు 24.35 కి.మీ వరకు, ఆటోమేటిక్ వేరియంట్ (పెట్రోల్) లీటరుకు 25.19 కి.మీ వరకు, అలాగే సీఎన్‌జీ(మాన్యువల్) వేరియంట్ ఒక కిలోగ్రాము సీఎన్‌జీ(CNG)లో 34.05 కి.మీ వరకు మైలేజీ ఇస్తుంది.
ధర, ఆఫర్లు : జీఎస్టీ సంస్కరణలకు ముందు మారుతి సుజుకీ వ్యాగన్‌ఆర్ ధర రూ. 5.79 లక్షలు (ఎక్స్ షోరూమ్) నుంచి రూ. 7.50 లక్షలు (ఎక్స్ షోరూమ్) వరకు ఉండేది. జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చాక రూ. 4.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) నుంచి రూ. 6.84 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీలు ఆఫర్ల(Offers)ను ప్రకటిస్తుంటాయి. మారుతి సుజుకీ పరిమిత సమయం వరకు ఫ్లెక్సిబుల్ ఈఎంఐ పథకాలను అందిస్తోంది. కార్ ఫైనాన్స్‌పై ప్రాసెసింగ్ రుసుము(Processing fee)లో 100 శాతం మాఫీ చేస్తోంది. అంటే ప్రాసెసింగ్ రుసుములు ఉండవు.
