అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. చనక కొరాట ఎత్తిపోతల పథకం, సదర్మట్ బ్యారేజీలను ప్రారంభించి రైతులకు సాగునీరు విడుదల చేశారు.
ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) బోరాజ్ మండలంలోని హాతిఘాట్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనక కొరాట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం హెలిప్యాడ్‌లో దిగారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.
CM Revanth Reddy | సదర్మట్ బ్యారేజీని..
ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం నిర్మల్ జిల్లా (Nirmal District)కు చేరుకున్నారు. పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజీని ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. నిర్మల్ జిల్లా నాయకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. బాసర సరస్వతీ అమ్మవారి చిత్రపటం బహూకరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సాయంత్రం సీఎం బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
CM Revanth Reddy | జైపాల్‌రెడ్డికి నివాళి
మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం నివాళులు అర్పించారు. నెక్లెస్ రోడ్‌లో ఉన్న ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.