Homeజిల్లాలునిజామాబాద్​Kotapati | ‘చలో జగిత్యాల్ – గల్ఫ్ గోస’ సభను విజయవంతం చేయాలి

Kotapati | ‘చలో జగిత్యాల్ – గల్ఫ్ గోస’ సభను విజయవంతం చేయాలి

జగిత్యాల్​లో గల్ఫ్​గోస సభను విజయవంతం చేయాలని ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు కోరారు. ఆర్మూర్​ పట్టణంలో విలేకరులతో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ : Kotapati | జగిత్యాల్​లో గల్ఫ్​గోస సభను విజయవంతం చేయాలని ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు (Kotapati Narasimham Naidu) కోరారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగిత్యాల్​ (Jagityal​)లో 23న గల్ఫ్ గోస సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ సాధనకు జిల్లాలోని గల్ఫ్ కార్మికులు (Gulf Workers) అధికసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఇస్తున్న రూ.5లక్షలను 18దేశాలకు వర్తింపజేయాని ఆయన కోరారు. వీటిని సాధించుకునేందుకు సభ ఏర్పాటు చేశామని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎల్లుల్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.