HomeతెలంగాణKodanda Reddy | ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన భూమి విరాళం ఇచ్చిన రైతు కమిషన్​...

Kodanda Reddy | ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన భూమి విరాళం ఇచ్చిన రైతు కమిషన్​ ఛైర్మన్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kodanda Reddy | తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ (Farmers Commission Chairman) కోదండ రెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. రూ.నాలుగు విలువైన రెండు వేల చదరపు గజాల భూమిని ప్రభుత్వానికి విరాళం ఇచ్చారు. తన మామ మల్లారెడ్డి యాచారం (Yacharam) మండల కేంద్రంలో కోదండరెడ్డికి భూమి బహుమతిగా ఇచ్చారు.

ఆ భూమిలో ఇప్పటికే రైతు మిత్ర (Rythu Mitra) కమ్యూనిటీ హాల్​ పేరిట భవనం నిర్మించారు. రైతుల అవసరాల కోసం ఆ భవనంతో పాటు రెండు వేల గజాల స్థలాన్ని ఆయన వ్యవసాయ శాఖకు రాసిచ్చారు. ఈ మేరకు శనివారం భూమి పత్రాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందించారు. సదరు భూమి విలువ మార్కెట్​ రేటు ప్రకారం రూ.నాలుగు కోట్లు ఉంటుందని సమాచారం. ఈ భూమి రైతులకు ఉపయోగ పడుతుందని తాను నమ్ముతున్నట్లు కోదండ రెడ్డి అన్నారు. అనంతరం రైతు సమస్యలపై మంత్రితో చర్చించారు.

Must Read
Related News