Pakistanis | పాకిస్తానీయులపై కేంద్రం కఠిన చర్యలు.. వారికి రూ.3 లక్షల జరిమానా, మూడేళ్ల జైలు

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistanis : పాకిస్తానీయులు భారతదేశం విడిచి వెళ్లడానికి కేంద్రం గడువును విధించిన విషయం తెలిసిందే. దీనిని పాటించని వారికి అరెస్టు, ప్రాసిక్యూషన్, మూడేళ్ల వరకు జైలు శిక్ష / రూ. 3 లక్షల వరకు జరిమానా.. లేదా రెండూ విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏప్రిల్ 22న.. జమ్మూ కశ్మీర్‌లోని పహల్ గామ్​ లో పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ ఘటన తర్వాత కేంద్ర […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistanis : పాకిస్తానీయులు భారతదేశం విడిచి వెళ్లడానికి కేంద్రం గడువును విధించిన విషయం తెలిసిందే. దీనిని పాటించని వారికి అరెస్టు, ప్రాసిక్యూషన్, మూడేళ్ల వరకు జైలు శిక్ష / రూ. 3 లక్షల వరకు జరిమానా.. లేదా రెండూ విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఏప్రిల్ 22న.. జమ్మూ కశ్మీర్‌లోని పహల్ గామ్​ లో పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయులకు భారతదేశం విడిచి వెళ్లమంటూ ఆదేశాలు జారీ చేసింది. సార్క్ వీసాలు కలిగి ఉన్నవారు ఏప్రిల్ 26లోపు వెళ్లిపోవాలంది, వైద్య వీసాలు ఉన్న పాకిస్తానీయులు ఏప్రిల్ 29లోపు వెళ్లిపోవాలని ఆదేశించింది.

ఈ మేరకు ఆదివారం నాటికి వెళ్లిపోవాల్సిన 12 కేటగిరీల వీసాలలో వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, సందర్శకులు, గ్రూప్ టూరిస్ట్, యాత్రికులు, గ్రూప్ యాత్రికుల వీసాలు ఉన్నాయి.

ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం 2025 ప్రకారం, వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలో ఉండడం, వీసా షరతులను ఉల్లంఘించడం లేదా నిషేధిత ప్రాంతాలలోకి అతిక్రమించిన నేరం కింద.. మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 3 లక్షల వరకు జరిమానా విధించబడుతుందని కేంద్రం హెచ్చరించింది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...