అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Airport | ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై హ్యాకర్లు కుట్రకు పాల్పడ్డారు. జీపీఎస్ స్పూఫింగ్ (GPS spoofing) చేశారు. చాలా విమానాలకు తప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ పంపి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు.
ఢిల్లీలోని విమానాశ్రయం చుట్టూ నావిగేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించిన GPS-స్పూఫింగ్ సంఘటనను భారత ప్రభుత్వం ధృవీకరించింది. చాలా విమానాలు జీపీఎస్, జీఎన్ఎస్ఎస్ అంతరాయంతో ఇబ్బంది పడ్డట్లు తెలిపింది. పైలట్లు ప్రత్యామ్నాయ ల్యాండింగ్ పద్ధతులకు మారాల్సి వచ్చిందని విమానయాన అధికారులు తెలిపారు. ఈ ఘటన విమాన భద్రత, భారత వైమానిక స్థలం భద్రతపై తీవ్రమైన ఆందోళనలకు దారితీసింది.
Delhi Airport | విమానాల దారి మళ్లింపు
ఢిల్లీకి చేరుకుంటున్న విమానం నకిలీ GPS సిగ్నల్‌లను తీసుకోవడం ప్రారంభించింది. దీని ప్రభావంతో ఆన్‌బోర్డ్ వ్యవస్థలను స్థానాన్ని తప్పుగా లెక్కిస్తుంది. నావిగేషన్ స్క్రీన్లు వాస్తవికతకు అనుగుణంగా ఉండవు. దీనిని వెంటనే గమనించిన అధికారులు, సిబ్బంది విమానాన్ని దారి మళ్లించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇండిగో (Indigo), ఎయిర్ ఇండియా (Air India)తో సహా అనేక విమానాలను నావిగేషన్ రీడింగ్‌లను నమ్మలేకపోవడంతో జైపూర్‌కు మళ్లించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మంత్రి రామ్ మోహన్ నాయుడు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విమాన ప్రయాణికుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా భారతదేశం సంప్రదాయ, గ్రౌండ్-బేస్డ్ నావిగేషన్, నిఘా వ్యవస్థల కనీస ఆపరేటింగ్ నెట్‌వర్క్ (MON)ను కొనసాగిస్తుందని తెలిపారు. జీపీఎస్ ఆధారిత నావిగేషన్ అంతరాయం కలిగితే ఈ వ్యవస్థలు ఉపయోగించుకోవచ్చు.
