అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vizag Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్ (Vishaka Steel Plant ) ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఫ్యాక్టరీ నుంచి వందశాతం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామని తెలిపింది. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తామని గతంలోనే కేంద్రం నిర్ణయించింది. ఫ్యాక్టరీ రూ.35 వేల కోట్ల రుణాలు ఉన్నాయి. అలాగే సంస్థ నష్టాల్లో నడుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం దానిని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించింది. అయితే కార్మికులు, ఏపీకి చెందిన నాయకులు ఆందోళనలు చేశారు. విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు అంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో కేంద్రం వెనక్కి తగ్గిందని వార్తలు వచ్చాయి.
Vizag Steel Plant | బడ్జెట్‌లో భారీగా నిధులు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం బడ్జెట్‌లో (Central Budget) భారీగానే నిధులు కేటాయించింది. 2024-25 బడ్జెట్‌లో రూ.8,622 కోట్లను కేటాయించిన ప్రభుత్వం, 2025-26లో రూ.3,295 కోట్లు కేటాయించింది. అంతేగాకుండా ప్రైవేట్ పరం చేయకుండా సెయిల్ (Sail)లో విలీనం చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా కేంద్రం దీనిపై స్పష్టత ఇచ్చింది.
Vizag Steel Plant | ఆ ప్రాతిపదన లేదు
విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందని ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ (Srinivas Varma) తెలిపారు. రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) ప్రశ్నకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖలో స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. అలాగే ఫ్యాక్టరిలో పని చేసే ఉద్యోగుల్లో ఇప్పటివరకు 1,017 మంది వీఆర్ఎస్ తీసుకున్నారని తెలిపారు.