HomeజాతీయంIndigo Flights | విమాన టికెట్‌ ధరల పెంపుపై కేంద్రం ఆగ్రహం.. చర్యలు తీసుకుంటామని వార్నింగ్​

Indigo Flights | విమాన టికెట్‌ ధరల పెంపుపై కేంద్రం ఆగ్రహం.. చర్యలు తీసుకుంటామని వార్నింగ్​

ఇండిగో విమానాలు రద్దు కావడంతో ఇతర సంస్థలు టికెట్​ రేట్లను భారీగా పెంచాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indigo Flights | విమాన టికెట్​ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో ఎయిర్​లైన్స్​ (Indigo Airlines) సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇండిగోకు చెందిన వందలాది ఫ్లైట్స్​ రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికుల రద్దీ నెలకొంది. దీంతో మిగతా ఎయిర్​లైన్​ సంస్థలు (Airlines) దీనిని ఆసరాగా తీసుకొని టికెట్​ రేట్లను భారీగా పెంచాయి. గతంలో కంటే రెట్టింపు ధరలను అమలు చేస్తున్నాయి. దీనిపై తాజాగా కేంద్ర విమానయాన శాఖ (Ministry of Civil Aviation) జోక్యం చేసుకుంది. ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా తీసుకొని ఛార్జీల పెంచడంపై మండిపడింది. ఇండిగో సర్వీసులు రద్దయిన రూట్లలో టికెట్‌ ధరలను ఖరారు చేసింది. కొత్త ఛార్జీలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ రేట్లు అమలు చేయాలని పేర్కొంది. ప్రయాణికులపై అదనపు భారం మోపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Indigo Flights | ప్రయాణికుల అవస్థలు

దేశంలోని ఎయిర్​లైన్స్​లో ఇండిగో దాదాపు 70శాతం మార్కెట్ వాటా కలిగి ఉంటుంది. ఆ సంస్థ వందలాది విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. ఎయిర్​పోర్టులు (Airports) చేపల మార్కెట్​ను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన లగేజీ, ప్రయణికులతో గందరగోళం నెలకొంది. ఐదో రోజూ ఇండిగో సర్వీసులు రద్దు అయ్యాయి. సర్వీసులు రద్దయిన మార్గాల్లో ప్రభుత్వం శనివారం ఛార్జీల పరిమితులను విధించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన నియంత్రణ అధికారాలను ఉపయోగించుకుని, అన్ని విమానయాన సంస్థలు కొత్తగా సూచించిన ధరల పరిమితులను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

Indigo Flights | భారీగా ఫిర్యాదులు

సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (Central Consumer Protection Authority)కి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. టికెట్​ రద్దుకు సంబంధించి రీఫండ్​లు రావడం లేదని జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు ఇప్పటివరకు రీఫండ్‌లు 50 కి పైగా ఫిర్యాదులు అందాయి. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఇండిగోను 100 శాతం రీఫండ్‌లను జారీ చేయాలని, ఎటువంటి షరతులు, అదనపు ఛార్జీలు లేకుండా రీషెడ్యూల్ చేసుకోవడానికి అనుమతించాలని ఆదేశించింది.

Must Read
Related News