Homeఅంతర్జాతీయంMalaysia Indians | మలేసియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా.. బతుకమ్మ.. దీపావళి సంబరాలు

Malaysia Indians | మలేసియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా.. బతుకమ్మ.. దీపావళి సంబరాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Indians | భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేసియా (BAM) ఆధ్వర్యంలో, మలేసియాలోని అన్ని భారతీయ సమాజాలు కలిసి దసరా Dussehra, బతుకమ్మ Bathukamma, దీపావళి Diwali వేడుకలను ఘనంగా నిర్వహించాయి. టానియా బ్యాంక్వెట్ హాల్, బ్రిక్ఫీల్డ్స్ లో ఈ సంబరాలు కొనసాగాయి.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. భారత హైకమిషనర్ Indian High Commissioner, మలేసియా ప్రభుత్వ Malaysian government ప్రతినిధులు పాల్గొని వేడుకకు విశిష్టతను తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ “ఈ వేడుక తెలుగు వారికే పరిమితం కాకుండా భారత దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతి భారతీయుడు ఐక్యంగా నిర్వహించుకున్న ఒక గొప్ప సాంస్కృతిక మహోత్సవం..” అని పేర్కొన్నారు. ఈ వేడుక నిజంగా కనుల పండువగా నిలిచింది..” అని అభినందించారు.

Malaysia Indians | పలు సాంస్కృతిక వేడుకలు..

సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పాటలు, పండుగ ప్రత్యేకతలతో కూడిన కార్య‌క్ర‌మాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకలో మలేసియాలో నివసిస్తున్న అన్ని భారతీయ NRIలు పాల్గొని BAM మహోత్సవాన్ని విజయవంతం చేశారు.

BAM అధ్యక్షుడు చొప్పరి సత్య మాట్లాడుతూ..
“ఈ వేడుకను విజయవంతం చేయడంలో సహకరించిన భారత హైకమిషన్, మలేసియా ప్రభుత్వ అధికారులు, అతిథులు, స్పాన్సర్లు, కమిటీ సభ్యులు, మలేసియాలోని భారతీయ సమాజానికి మనఃపూర్వక కృతజ్ఞతలు..” అని అన్నారు.

కార్యక్రమంలో BAM ఉపాధ్యక్షుడు భాను ముత్తినేని, ప్రధాన కార్యదర్శి (IT, PR కమ్యూనికేషన్) రవితేజ శ్రీదశ్యం, కోశాధికారి రుద్రాక్షల సునీల్ కుమార్, సంయుక్త కోశాధికారి గజ్జడ శ్రీకాంత్, యువజన నాయకుడు రుద్రాక్షల రవికిరణ్ కుమార్, మహిళా సాధికారత నాయకురాలు గీత హజారే, కార్యవర్గ సభ్యులు సోప్పరి నవీన్, యెనుముల వెంకట సాయి, సైచరణి కొండ, రహిత, సోప్పరి రాజేష్, పలకలూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.