అక్షరటుడే, కామారెడ్డి: Sankrathi Festival | సంక్రాంతి పండుగను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం భోగి సంబరాలు (Bhogi celebrations) నిర్వహించారు. ఎస్పీ రాజేష్ చంద్ర కుటుంబ సభ్యులతో పాటు జిల్లా పోలీసులు సంబరాల్లో పాల్గొన్నారు.
Sankrathi Festival | ఎస్పీ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్..
ఎస్పీ కార్యాలయంలో పోలీస్‌బాస్ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్ (kite flying festival) నిర్వహించారు. భోగి మంటను వెలిగించి ప్రజలకు, పోలీస్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మైదానంలో ఏర్పాటు చేసిన పతంగుల పండుగలో అడిషనల్ ఎస్పీ, కామారెడ్డి ఏఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. అందరూ కలిసి రంగురంగుల పతంగులను ఎగురవేస్తూ ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
Sankrathi Festival | సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక పండుగలు..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని, ఇలాంటి వేడుకలు పోలీస్ కుటుంబాల మధ్య ఐక్యతను, పరస్పర స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. నిరంతరం విధుల్లో నిమగ్నమయ్యే పోలీస్ సిబ్బందికి ఈ తరహా కార్యక్రమాలు మానసిక ఉల్లాసం, కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా పతంగులు ఎగురవేసే సమయంలో చైనీస్ మాంజా లేదా నైలాన్ మాంజా వాడకూడదని సూచించారు. అవి పక్షులకు మాత్రమే కాకుండా, వాహనదారుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ముప్పుగా మారతాయని హెచ్చరించారు.
Sankrathi Festival | పండుగలు విషాదం కారాదు..
ప్రజలంతా కేవలం నూలు దారం మాత్రమే ఉపయోగించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పండుగలు ఆనందాన్ని పంచాలే తప్పా విషాదాన్ని మిగల్చకూడదని, సంప్రదాయాలను గౌరవిస్తూ భద్రతా నియమాలను పాటించాలన్నారు. ప్రతి కుటుంబం సురక్షితంగా, ఆనందంగా ఉండాలన్నదే పోలీస్ శాఖ సంకల్పమని తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి అడిషనల్ ఎస్పీ నరసింహా రెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఆర్‌ఐలు సంతోష్ కుమార్, కృష్ణ, ఆర్‌ఎస్సైలు, జిల్లా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.