అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | నైని బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణ (CBI Investigation) చేపట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాలేరు సభలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హరీశ్‌రావు స్పందించారు. తమ పార్టీ గద్దెల జోలికొస్తే సీఎం గద్దె కూలుతుందన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Harish Rao | సైట్ విజిట్ అందుకే..
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొత్తగా సింగరేణి టెండర్లు వేయడానికి సైట్ విసిట్ సర్టిఫికెట్ అనే విధానాన్ని తెచ్చిందన్నారు. దీంతో టెండర్లు ఆన్‌లైన్‌లో వేయకుండా కాంట్రాక్టర్లు సైట్‌కు వెళ్లి చూసి సింగరేణి నుంచి ఈ సర్టిఫికెట్ పొందాలన్నారు. ఇలా టెండర్లు ఎవరు వేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి ముందే తెలుసుకున్నాడని, తర్వాత వారిని టెండర్లు రద్దు చేసుకోమని బెదిరించారని ఆరోపించారు. ఇలా తమకు అనుకూలంగా ఉన్న వారికి టెండర్లు కట్టబెట్టారని విమర్శించారు. ఈ విధానం తెచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి తొలి టెండర్ దక్కించుకుందన్నారు.
Harish Rao | టెండర్లు రద్దు చేయాలి
కాంట్రాక్టు సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దీని మీద వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన బీజేపీ పార్టీ (BJP Party), కిషన్ రెడ్డిని కోరారు. అలా చేస్తే తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలను సబ్మిట్ చేస్తానని చెప్పారు. తెలంగాణ వ్యతిరేకులకు సీఎం, డిప్యూటీ సీఎం భక్తులుగా మారారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) పరమ భక్తుడిని అని అంటారని, డిప్యూటీ సీఎం ఏమో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి విధేయుడిని అని అంటున్నారని ఎద్దేవా చేశారు.