HomeసినిమాActress Dimple Hayati | ప‌ని మ‌నుషుల‌తో దారుణంగా ప్ర‌వ‌ర్తించిన హీరోయిన్.. దుస్తులు విప్పి కొట్టేందుకు...

Actress Dimple Hayati | ప‌ని మ‌నుషుల‌తో దారుణంగా ప్ర‌వ‌ర్తించిన హీరోయిన్.. దుస్తులు విప్పి కొట్టేందుకు య‌త్నం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Actress Dimple Hayati | టాలీవుడ్ నటి డింపుల్ హయాతి మరో వివాదంతో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే డీసీపీ రాహుల్ హెగ్డేతో పార్కింగ్ వివాదం కారణంగా వార్తల్లో నిలిచిన డింపుల్, ఇప్పుడు మరొక వివాదంలో ఇరుక్కుంది.

హైదరాబాద్‌(Hyderabad) షేక్‌పేటలోని వంశీరామ్ వెస్ట్ వుడ్స్ అపార్ట్‌మెంట్‌ కు ఇటీవలే షిఫ్ట్ అయిన డింపుల్, తన పెంపుడు కుక్కల సంరక్షణ కోసం ఒడిశాకు చెందిన ఇద్దరు యువతులను హౌస్ స్టాఫ్‌గా నియమించుకుందట. అయితే ఈ యువతులపై ఆమె మరియు ఆమె కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా వేధించారంటూ ఆ యువతులను పని కోసం పంపిన మహిళ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Actress Dimple Hayati | మీరు నా చెప్పులంతా కూడా కాదు!

వైరల్ వీడియో ప్రకారం, డింపుల్ భర్త అనే వ్యక్తి ఆ యువతులతో “మీరు నా చెప్పులంత విలువ కూడా చేయ‌రు”, “మీరు ఎంత?”, “మీ బ్రతుకెంత?” అంటూ దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా, జీతం కూడా చెల్లించకుండా ఇంటి నుంచి వారిని వెళ్లగొట్టారని, పైగా ‘‘మా ఆయన లాయర్‌.. మీరు మా మీద ఏం చేయలేరు’’ అంటూ డింపుల్ హయాతి బెదిరింపులకు దిగారని ఆ మహిళ తెలిపింది. ప‌ని మ‌నిషి పేరు ప్రియాంక బిబ‌ర్ అని తెలుస్తుండ‌గా, ఆమె ఇప్ప‌టికే పోలీస్ కేసు న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం. ఆమె చెప్పిన దాని ప్ర‌కారం పెంపుడు కుక్క(Pet Dog) అరిచిన దానికి కార‌ణం నేనే అని, అందుకుగాను భార్య భ‌ర్త‌లిద్దరు దుస్తులు విప్పేసి న‌న్ను న‌గ్నంగా నిలెబ‌ట్టేందుకు య‌త్నించార‌ని పేర్కొంది.

వీడియో రికార్డ్ చేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా, నా ఫోన్ తీసుకొని ప‌గ‌ల‌గొట్టాడ‌ని, నా త‌ల్లిదండ్రుల‌ని చంపేస్తామ‌ని డింపుల్ భ‌ర్త‌ బెదిరించాడ‌ని ప్రియాంక పేర్కొంది. ఈ వివాదంలో “డింపుల్ భర్త” అని వరుసగా ఓ మ‌హిళ ప్రస్తావించబడడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. డింపుల్ వివాహం జరిగిన విషయాన్ని ఎవ్వరూ గుర్తించకపోవడంతో, ఆమె అసలు పెళ్లి చేసుకుందా? అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇటీవల ‘రామబాణం’ సినిమాలో గోపీచంద్ సరసన కనిపించిన డింపుల్ హయాతి, ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో కొంత గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం ఆమె శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ వివాదంపై ఇప్పటివరకు డింపుల్ హయాతి నుండి ఎటువంటి స్పందన ఇవ్వలేదు.