అక్షరటుడే, కామారెడ్డి : Candlelight rally : పహల్గావ్ ఉగ్రదాడిలో మృతి చెందిన అమరులకు నివాళులర్పిస్తూ కామారెడ్డి విశ్వకర్మ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని కాళికాదేవి ఆలయం నుంచి పాంచ్ రస్తా, సుభాష్ రోడ్, రైల్వే కమాన్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.
కార్యక్రమంలో కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సెక్రెటరీ రాజు, కోశాధికారి నాగభూషణం, సహాయ కోశాధికారి రమేష్, సహాయ కార్యదర్శి వెంకట స్వామి, ముఖ్య సలహాదారులు బ్రహ్మం, గంగాధర్, మారుతి, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.