అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Allu Arjun | టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Arjun), తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కలిసి సినిమా తెరకెక్కించనున్నారు. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన విడుదలైంది.
బన్నీ, లోకేశ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో సినిమా వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ భోగి సందర్భంగా విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించనున్న ఈ సినిమానకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతానికి ఏఏ 23 ప్రాజెక్ట్ టైటిల్ ఖరారు చేశారు. త్వరలోనే తుది టైటిల్‌ను ప్రకటించనున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన వివరాలను చిత్రబృందం వీడియో రూపంలో విడుదల చేసింది.
Allu Arjun | తొలి చిత్రం
ఈ గ్లింప్స్‌లో హీరోని సింహంగా, అడవికి రాజుగా చూపించగా, నక్కల గుంపు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చిత్రీకరించారు. తాత్కాలికంగా AA23 అనే టైటిల్‌తో పిలవబడుతున్న ఈ ప్రాజెక్ట్, అల్లు అర్జున్ అట్లీతో తన సినిమాను పూర్తి చేసిన తర్వాత 2026లో సెట్స్‌పైకి వెళ్లనుంది. కూలీ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ మరో తమిళ హీరోతో కలిసి పనిచేస్తారని చాలామంది భావించినప్పటికీ, ఈ దర్శకుడు అల్లు అర్జున్‌తో సినిమాను ప్రకటించాడు. లోకేష్‌కు తెలుగులో ఇది తొలి చిత్రం.
Allu Arjun | అట్లీతో మూవీ
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పేరు ఇంకా ఖరారు చేయలేదు. ఏఏ22 వర్కింగ్ టైటిల్‌తో దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అనంతరం లోకేశ్‌తో బన్నీ సినిమా చేయనున్నాడు.