అక్షరటుడే, వెబ్‌డెస్క్: Airtel offer | ఎయిర్‌టెల్(Airtel) సంస్థ తన పోస్ట్ పెయిడ్ (Post paid), వైఫై కస్టమర్లకు 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం గూగుల్‌తో జట్టు కట్టింది. గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ (Subscription) కింద ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్, వైఫై(Wi fi) కస్టమర్లు అదనపు ఖర్చు లేకుండా 100 జీబీ గూగుల్ వన్ క్లౌడ్ (Google one cloud) స్టోరేజ్‌ని ఇస్తోంది. ఈ స్టోరేజ్‌ను ఐదుగురు వ్యక్తులతో పంచుకొనే సదుపాయాన్ని సైతం కల్పించింది. ఈ ఫ్రీ క్లౌడ్ సదుపాయాన్ని ఆండ్రాయిడ్‌తో పాటు ఐవోఎస్ యూజర్లు వినియోగించుకోవచ్చు. ఈ ప్రయోజనాలను పొందడానికి వినియోగదారులు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ (Airtel thanks app)లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది ఆరునెలలు మాత్రమే ఉచితం. ఆ తర్వాత క్లౌడ్ స్టోరేజీ కావాలనుకుంటే నెలకు రూ. 125 చెల్లించాల్సిందే.. ఆరు నెలల వరకు మాత్రం ఎలాంటి ఛార్జీలు లేకుండా 100 జీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చు. ఉచిత స్టోరేజీ గడువు ముగిసిన తర్వాత ఈ సేవలు వద్దనుకుంటే డీయాక్టివేట్ చేసుకోవచ్చు.
Airtel offer | ఎక్కువ స్టోరేజీ అవసరం అయినవారికి..
ఫోన్లలో స్టోరేజీ తక్కువగా ఉందని భావించేవారికి ఇది ఉపయోగపడుతుంది. గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ ప్లాన్‌ను (Google One cloud storage plan) పొందితే జీమెయిల్, ఫొటోలు, డ్రైవ్‌లలో కలిపి మొత్తానికి 100 జీబీ ఉచితంగా పొందుతారు. ఎందులో ఫైల్స్‌ను సేవ్ చేసుకున్నా ఒకే ప్లాట్‌ఫామ్‌పై స్టోరేజ్ లెక్కించబడుతుంది. గూగుల్ one లో lite, basic, standard అని మూడు రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా 30 GB నుంచి 200 GB వరకు క్లౌడ్ స్టోరేజీ పొందవచ్చు.