Nizamabad city | అనుమతులు లేకుండానే నిర్మాణం.. పట్టించుకోని యంత్రాంగం.. బీజేపీ నాయకుడికి అండదండలు..

అక్షరటుడే, నిజామాబాద్​: Nizamabad city | నిజామాబాద్​ నగరంలో (Nizamabad city) అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. కొందరు బడాబాబులు, రియల్టర్లు, రాజకీయ నాయకులు దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, నిబంధనలు పాటించకుండానే భవనాలు పూర్తి చేస్తున్నారు. వీరికి నగర పాలక సంస్థ (Nizamabad municipal corporation) అధికారులు అన్ని రకాల అండదండలు అందిస్తున్నారు. ఇందుకు నగరంలోని ఓ ప్రధాన రోడ్డు వెంబడి నిర్మాణంలో ఉన్న భవనమే ఉదాహరణ. సామాన్య ప్రజలు చిన్నపాటి […]

అక్షరటుడే, నిజామాబాద్​: Nizamabad city | నిజామాబాద్​ నగరంలో (Nizamabad city) అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. కొందరు బడాబాబులు, రియల్టర్లు, రాజకీయ నాయకులు దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, నిబంధనలు పాటించకుండానే భవనాలు పూర్తి చేస్తున్నారు. వీరికి నగర పాలక సంస్థ (Nizamabad municipal corporation) అధికారులు అన్ని రకాల అండదండలు అందిస్తున్నారు. ఇందుకు నగరంలోని ఓ ప్రధాన రోడ్డు వెంబడి నిర్మాణంలో ఉన్న భవనమే ఉదాహరణ.

సామాన్య ప్రజలు చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే అనుమతుల పేరిట మున్సిపల్​ అధికారులు హాడావుడి చేస్తారు. అనుమతులు లేవని సామాగ్రి సీజ్​ చేయడంతో పాటు నోటీసులు ఇస్తారు. ఇదే అదునుగా అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు డబ్బులు దండుకోవడం సర్వసాధారణం.

అయితే వర్ని రోడ్డులోని (Varni road) ఓ బార్​ సమీపంలో ప్రధాన రోడ్డు వెంబడి బీజేపీకి చెందిన నాయకుడు ఐదంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. కాగా.. ప్రస్తుతం భవనం మొత్తం పూర్తి కావాల్సి వచ్చింది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడం గమనార్హం. ప్రత్యేకించి ప్రధాన రహదారిని ఆనుకొని ఈ భవన నిర్మాణం జరుగుతున్నా.. మున్సిపల్​ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపు.

బీజేపీకి చెందిన సదరు నాయకుడు టీఎస్​ బీపాస్​ (TS bPASS) కింద ఐదంతస్తుల భవనం నిర్మాణానికి అనుమతి దరఖాస్తు చేసుకున్నాడు. కాగా.. నిబంధనల ప్రకారం నిర్మాణం జరగట్లేదని క్షేత్రస్థాయి అధికారులు గుర్తించారు. సెల్లార్​తో పాటు ఐదంతస్తుల భవనం నిర్మాణం చేపట్టగా డీవియేషన్లు ఉన్నట్లు తేల్చారు. అనంతరం అప్లికేషన్​ను కూడా తిరస్కరించి అనుమతులు నిరాకరించారు. ప్రక్రియ అంతా కూడా ఈ ఏడాది మార్చిలోనే జరిగిపోయింది. అయినప్పటికీ.. సదరు నాయకుడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని దర్జాగా బిల్డింగ్​ నిర్మాణ పనులు పూర్తి చేస్తుండడం గమనార్హం.

ఒకవిధంగా నగర పాలక సంస్థలో ఉండే అధికారులే సహకరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఓ డివిజన్​కు ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన సదరు నాయకుడు చిన్నపాటి ఇంటి నిర్మాణం చేపట్టినా తనకు ఎంతో కొంత ఇవ్వనిదే పనులు పూర్తి కానిచ్చేవాడు కాదని విమర్శలు ఉన్నాయి. అనమతులు లేని వాటికి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్​ చేయగా.. అప్పట్లో పలు ఆడియో రికార్డులు వైరల్​ అయ్యాయి. ప్రస్తుతం ఏ అధికారం లేకపోయినప్పటికీ.. దర్జాగా అక్రమ నిర్మాణం చేపడుతున్నా నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumar
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2006 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...