HomeతెలంగాణMP Aravind | అండర్ గ్రౌండ్ వంతెన నిర్మించండి

MP Aravind | అండర్ గ్రౌండ్ వంతెన నిర్మించండి

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: MP Aravind | డిచ్​పల్లి-ఘన్​పూర్ గ్రామాల మధ్య అండర్ గ్రౌండ్ వంతెన (Underground Bridge) నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఘన్ పూర్ వీడీసీ సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఘన్​పూర్ మీదుగా వెళ్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్​ను ​(MP Dharmapuri Arvind) కలిసి వినతిపత్రం అందజేశారు.

రైల్వేవంతెన లేక ఘన్​పూర్, ముల్లంగి, ఇస్లాంపుర, ఖిల్లా డిచ్​పల్లి, పోలీస్ క్యాంప్ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ట్రాఫిక్​తో సతమతమవుతున్నారని ఎంపీకి వివరించారు. రైల్వే స్టేషన్​లో ఫుట్ ఓవర్ వంతెన (Foot Over Bridge) లేకపోవడంతో ప్రయాణికులు, స్థానిక గ్రామాల ప్రజలు రైల్వేట్రాక్ దాటి ప్రమాదాల బారిన పడుతున్నారని దృష్టికి తెచ్చారు. వెంటనే అండర్ గ్రౌండ్ వంతెనతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరుకు చొరవ చూపాలని ఎంపీకి విన్నవించారు. ఎంపీ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, మండల నాయకులు సతీష్ రెడ్డి, చంద్రకాంత్, తదితరులున్నారు.

Must Read
Related News