Budvel trumpet junction | మహానగర రోడ్డు వ్యవస్థకు మహర్దశ.. బుద్వేల్​ వద్ద ట్రంపెట్​ జంక్షన్​ ఏర్పాటుకు ప్రణాళిక!

అక్షరటుడే, హైదరాబాద్​: Budvel trumpet junction | హైదరాబాద్ రహదారి వ్యవస్థకు మహర్ధశ చేకూరబోతోంది. ఔటర్ రింగ్ రోడ్డు Outer Ring Road నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు అన్ని దిశల్లోనూ కనెక్టివిటీ ఏర్పడబోతోంది. ఈ మేరకు హెచ్ఎండీఏ పెద్ద ప్రణాళికే రూపొందించింది. ఈ క్రమంలోనే బుద్వేల్ లేఅవుట్ వద్ద మరో ట్రంపెట్ జంక్షన్‌ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.  అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టు చేపట్టబోతున్నారు. దాదాపు రూ. 488 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు […]

అక్షరటుడే, హైదరాబాద్​: Budvel trumpet junction | హైదరాబాద్ రహదారి వ్యవస్థకు మహర్ధశ చేకూరబోతోంది. ఔటర్ రింగ్ రోడ్డు Outer Ring Road నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు అన్ని దిశల్లోనూ కనెక్టివిటీ ఏర్పడబోతోంది. ఈ మేరకు హెచ్ఎండీఏ పెద్ద ప్రణాళికే రూపొందించింది. ఈ క్రమంలోనే బుద్వేల్ లేఅవుట్ వద్ద మరో ట్రంపెట్ జంక్షన్‌ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.  అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టు చేపట్టబోతున్నారు. దాదాపు రూ. 488 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు.

Budvel trumpet junction | ఇంటర్​ ఛేంజ్​ అనుసంధానం..

బుద్వేల్​ లేఅవుట్ వద్ద ఈ ట్రంపెట్ అందుబాటులోకి వస్తే గ్రేటర్​ హైదరాబాద్​లో వాహన రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం సైతం ఆదా కానుంది. బుద్వేల్ లేఅవుట్ నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్–2 వరకు, రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ ఇంటర్‌ ఛేంజ్​ను అనుసంధానిస్తారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించారు. రేడియల్ రోడ్ నుంచి ఔటర్​ వరకు, అటుపై గచ్చిబౌలి, అంతర్జాతీయ విమానాశ్రయాని(శంషాబాద్)కి చేరుకునేలా ప్లాన్​ చేశారు.

ప్రస్తుతం కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ Kokapet Neopolis layout వద్ద ట్రంపెట్ ఫ్లైఓవర్ ఉంది. ఈ తరహాలో ఈ కొత్త ట్రంపెట్‌ను సైతం నిర్మించనున్నారు. కోకాపేట ట్రంపెట్ వల్ల పలు ప్రాంతాల నుంచి శంకర్‌పల్లి వైపు వెళ్లే వాహనాల రద్దీ తగ్గినట్లే, బుద్వేల్ ట్రంపెట్ వల్ల సైతం అదే స్థాయిలో ప్రయోజనం కలగనుంది. ట్రంపెట్ మీదుగా వెళ్లేవారికి ఎటువంటి అంతరాయాలు కలగకుండా  ‘సీమ్‌లెస్ జర్నీ’ సౌకర్యం కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...