అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Realme C85 5G | చైనాకు (China) చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మీ నుంచి మరో మోడల్ వస్తోంది. రియల్‌మీ సీ85 5జీ (Realme C85 5G) పేరుతో దీనిని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో లాంచ్ చేయనుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) అందుబాటులో ఉండనుంది. ఫస్ట్ సేల్ కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రారంభం కానుంది. ప్రీమియం లుక్‌తో (Premium look) వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 13 వేలనుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ ఫోన్ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.
Realme C85 5G | డిస్‌ప్లే..
6.8 inch ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 720 x 1570 పిక్సల్స్ రిజల్యూషన్, IP68, IP69 ప్రొ లెవల్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ కలిగి ఉంటుంది.
Realme C85 5G | సాఫ్ట్‌వేర్..
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
Realme C85 5G | కెమెరా..
వెనుకవైపు 50 మెగాపిక్సెల్(MP) మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చారు.
Realme C85 5G | బ్యాటరీ..
7000 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 45w ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. వంద శాతం చార్జ్ చేస్తే 22 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్, 50 గంటల కాలింగ్, 145 గంటలపాటు మ్యూజిక్ ప్లే వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఒక శాతం చార్జింగ్ ఉన్నా స్టాండ్‌బైలో 9 గంటలపాటు ఉంటుందని, 40 నిమిషాల కాల్స్ మాట్లాడుకోవచ్చని ప్రకటించింది.
Realme C85 5G | వేరియంట్స్..
8 GB ర్యామ్ + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, 8 GB ర్యామ్ + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌లో, గ్రీన్, పర్పుల్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ. 12,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
