అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Redmi 15 C 5 G Smart Phone | చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ అయిన రెడ్‌మీ.. భారత మార్కెట్‌లో మరో మోడల్‌ను ఆవిష్కరించింది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో మూడు వేరియంట్ల(Three Variants)లో తీసుకువస్తోంది. అమెజాన్ (Amazon)తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ మోడల్ స్పెసిఫికేషన్స్ చూసేద్దామా..
డిస్‌ప్లే : 6.90 inch ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో తీసుకువచ్చిన ఈ ఫోన్.. 120 Hz రిఫ్రెష్ రేట్, 720 * 1600 పిక్సల్స్ రిజల్యూషన్, IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ కలిగి ఉంది.
సాఫ్ట్‌వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం ఆధారిత హైపర్ ఓఎస్ 2 ఓఎస్‌తో పనిచేస్తుంది. రెండేళ్లపాటు ఓఎస్, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ (Security Updates) ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
కెమెరా సెటప్ : వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్‌అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ సామర్థ్యం : 6000 mAh బ్యాటరీ అమర్చారు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 107 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 33 w ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 28 నిమిషాలలో 50 శాతం చార్జింగ్ అవుతుందని తెలిపింది. 10డబ్ల్యూ వైర్డ్ రివర్స్ చార్జింగ్‌కు అవకాశం ఉందని పేర్కొంది.
వేరియంట్స్ : మూన్ లైట్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్, డస్క్ పర్పుల్ కలర్స్‌తో వస్తున్న ఈ మోడల్ మూడు వేరియంట్లలో లభించనుంది.
4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,499 ఉండే అవకాశాలున్నాయి. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.