Homeబిజినెస్​Moto G57 Power | భారీ బ్యాటరీతో మోటో నుంచి బడ్జెట్‌ ఫోన్‌

Moto G57 Power | భారీ బ్యాటరీతో మోటో నుంచి బడ్జెట్‌ ఫోన్‌

మోటోరొలా నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. భారీ బ్యాటరీతో బడ్జెట్‌ ధరలో దీనిని తీసుకువచ్చారు. ధర తక్కువైనా ఆధునిక ఫీచర్స్‌ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : దేశీయ స్మార్ట్‌ఫోన్‌ (Smart Phone) మార్కెట్‌లో మోటోరొలా కంపెనీ మరో మోడల్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్‌ 16తో పనిచేసే ఈ ఫోన్‌.. 7000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ ఫీచర్లూ (AI Features) ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్‌ 3 నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్‌ ధరలో తీసుకువచ్చిన మోటోరొలా జీ 57 పవర్‌ 5జీ స్పెసిఫికేషన్స్‌ తెలుసుకుందామా..

డిస్‌ప్లే : 6.72 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌, 120 Hz రిఫ్రెష్‌ రేటు, 120 Hz టచ్‌ శాంప్లింగ్‌ రేటుతో వస్తోంది. గొరిల్లా గ్లాస్‌ 7i, మిలిటరీ గ్రేడ్‌ 810H ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

సాఫ్ట్‌వేర్‌ : స్నాప్‌డ్రాగన్‌ 6s Gen 4 చిప్‌సెట్‌ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్‌ 16తో పనిచేస్తుంది.

కెమెరా సెటప్‌ : వెనకవైపు 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ600 కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా అమర్చారు. కెమెరా పరంగా కొన్ని ఏఐ(AI) ఫీచర్లున్నాయి. షాట్‌ ఆప్టిమైజేషన్‌, ఆటో స్మైల్‌ కాప్చర్‌, మ్యాజిక్‌ ఎరేజర్‌, ఫొటో అన్‌బ్లర్‌ వంటి ఏఐ ఫీచర్లను అందించారు.

బ్యాటరీ సామర్థ్యం : సిలికాన్‌ కార్బన్‌ టెక్నాలజీతో రూపొందించిన 7000 mAh బ్యాటరీ అమర్చారు. ఇది 33w ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

వేరియంట్‌ : మోటో జీ57 పవర్‌ను ఒకే ఒక్క వేరియంట్‌లో మూడు రంగుల్లో తీసుకువచ్చారు. 8జీబీ, 128జీబీ వేరియంట్‌ ధర రూ.14,999గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌ ఎస్‌బీఐ, ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో ఐదు శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ లభించనుంది.

Must Read
Related News