అక్షరటుడే, భీమ్‌గల్: Mla Prashanth reddy | ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే బీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (MLA Prashanth Reddy) అన్నారు. మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ (Congress party) ముఖ్య నాయకులు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకులు, వీడీసీ అధ్యక్షుడు నీలం రవి, సీనియర్ నాయకులు షవ్వ అశోక్, కర్నె నరేష్‌లకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Mla Prashanth reddy | బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి..
ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) నాయకత్వంలో పదేళ్ల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగానే తాము కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్లో చేరినట్లు నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, మాజీ జడ్పీటీసీ చౌట్పల్లి రవి, మాజీ కౌన్సిలర్ బోదిరే నర్సయ్య, కర్నె మహేందర్ తదితరులు పాల్గొన్నారు.