ePaper
More
    HomeతెలంగాణBRS | పోరుబాటకు సిద్ధమవుతున్న బీఆర్​ఎస్​.. త్వరలో ముఖ్య నేతలతో కేసీఆర్​ సమావేశం

    BRS | పోరుబాటకు సిద్ధమవుతున్న బీఆర్​ఎస్​.. త్వరలో ముఖ్య నేతలతో కేసీఆర్​ సమావేశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | కొంతకాలంగా సైలెన్స్​గా ఉన్న బీఆర్ఎస్ (BRS party)​ పార్టీ మళ్లీ పోరుబాట పట్టనుంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

    రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యకర్తల్లో జోష్​ నింపడంతో పాటు ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్లడానికి గులాబీ బాస్​ యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన త్వరలోనే బీఆర్ఎస్‌ ముఖ్య నేతలతో భేటీకానున్నారు. రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. రైతుల కోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని బీఆర్ఎస్‌ నిర్ణయం తీసుకుంది.

    BRS | కార్యకర్తల్లో అయోమయం

    కాళేశ్వరం కమిషన్​ (Kaleshwaram Commission) విచారణ, ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone tapping case), ఫార్ములా ఈ కారు రేస్​ కేసులో కేటీఆర్​ విచారణ తదితర అంశాలతో బీఆర్​ఎస్​లో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు కవిత ఎపిసోడ్​తో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు సైలెన్స్​గా ఉండిపోయారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR))​ అధికారం పోయిన నాటి నుంచి ప్రజాక్షేత్రంలోకి అంతగా వెళ్లడం లేదు. ఫామ్​హౌస్​కే పరిమితం అయినా గులాబీ బాస్​ చివరి సారి బీఆర్​ఎస్​ రజతోత్సవ సభలో మాట్లాడారు. దీంతో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడానికి మరో ఉద్యమం చేపట్టాలని బీఆర్​ఎస్​ భావిస్తోంది.

    BRS | సాగునీటి ప్రాజెక్ట్​లపై..

    తెలంగాణ ఉద్యమంతో అంచలంచెలుగా ఎదిగి పదేళ్లు అధికారం చేపట్టిన బీఆర్​ఎస్​.. మళ్లీ ఉద్యమం ద్వారానే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. గతంలో నీళ్లు, నిధులు, నియామకాలు పేరిట సాగిన ఉద్యమంతో గులాబీ జెండా రెపరెపలాడింది. తాజాగా బీఆర్ఎస్​ సాగునీటి ప్రాజెక్ట్​లతో పాటు రైతాంగ సమస్యలపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది.

    కాళేశ్వరంపై నిర్లక్ష్యం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం, ప్రాజెక్టుల నిర్వహణ వైఫల్యంపై ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని బీఆర్​ఎస్​ యోచిస్తోంది. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి మౌనం వహించారని బీఆర్​ఎస్​ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తి అయిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనబెట్టడంతో పాటు 2 పిల్లర్లు కుంగాయన్న సాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చారని ప్రజలకు వివరించనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్​తో తెలంగాణకు జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని బీఆర్​ఎస్​ నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ త్వరలో ముఖ్య నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...