అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Insurance Money | బీమా డబ్బుల కోసం సొంత అన్న చంపాడో వ్యక్తి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా (Karimnagar District)లో చోటు చేసుకుంది. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కరీంనగర్ జిల్లా రామడుగు మండల (Ramadugu Mandal) కేంద్రానికి చెందిన మామిడి నరేష్(30) రెండు టిప్పర్లను కొనుగోలు చేసి, వాటిని అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల వ్యాపారం సరిగ్గా నడవకపోవడంతో అప్పుల పాలు అయ్యాడు. అంతేగాకుండా ఇతర వ్యాపారాలు చేసి నష్టపోయాడు. దీంతో రూ.1.5 కోట్ల అప్పు అయింది. ఈ అప్పు తీర్చడానికి తన అన్నను చంపాలని నరేశ్ పథకం రచించాడు.
Insurance Money | బీమా చేయించి..
నరేశ్ సోదరుడు వెంకటేశ్ (37)కు మానసిక పరిపక్వత లేదు. దీంతో అతడికి వివాహం కాలేదు. ఒంటరిగా ఉన్న తన అన్న పేరిట నరేశ్ వివిధ కంపెనీల్లో మొత్తం రూ.4.14 కోట్లకుపైగా బీమా చేయించాడు. అంతేగాకుండా యాక్సిస్ బ్యాంకు (Axis Bank)లో వెంకటేశ్ పేరిట రూ.20 లక్షల గోల్డ్ లోన్ కూడా తీసుకున్నాడు. తన సోదరుడు చనిపోతే.. లోన్లు మాఫీ కావడంతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని భావించాడు. ఆ డబ్బులతో అప్పులు కట్టాలని ప్లాన్ వేశాడు.
Insurance Money | మరో ఇద్దరితో కలిసి..
రాకేశ్ అనే వ్యక్తి దగ్గర నరేశ్ రూ.7 లక్షలు అప్పు చేశాడు. ఆ డబ్బులు ఇవ్వాలని అతడు కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తన అన్న చంపాడనికి సహకరిస్తే.. రూ.7 లక్షలతో పాటు అదనంగా రూ.13 లక్షలు ఇస్తానని చెప్పాడు. ప్రదీప్ అనే టిప్పర్ డ్రైవర్‌కు రూ.2 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివారులో టిప్పర్ ఆగిపోయిందని వెంకటేష్‌కు డ్రైవర్ ఫోన్ చేసి పిలిచాడు. అక్కడి చేరుకున్న అనంతరం టిప్పర్ కింద జాకీ పెట్టాలని వెంకటేశ్‌కు సూచించాడు. అతడు టిప్పర్ కింద పడుకొని జాకీ పెడుతున్న సమయంలో నరేశ్ ముందుకు నడిపాడు. దీంతో వెంకటేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు.
Insurance Money | ఇలా దొరికాడు..
తన అన్న ప్రమాదవశాత్తు మరణించినట్లు నరేశ్ అందరిని నమ్మించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించేందుకు వచ్చిన కంపెనీ ప్రతినిధులకు నరేశ్ ఇచ్చే సమాధానాలపై అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
