ePaper
More
    Homeఅంతర్జాతీయంBritish Airways | శంషాబాద్​లో నిలిచిపోయిన బ్రిటిష్​ ఎయిర్​వేస్​ విమానం.. ఎందుకో తెలుసా..!

    British Airways | శంషాబాద్​లో నిలిచిపోయిన బ్రిటిష్​ ఎయిర్​వేస్​ విమానం.. ఎందుకో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: British Airways | ఇరాన్​(Iran)పై అమెరికా దాడులు చేయడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్​లోని పలు అణు స్థావరాలపై శనివారం రాత్రి అమెరికా (America) దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport)లో బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం నిలిచిపోయింది.

    హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం సుమారు రెండు గంటలుగా రన్​వేపైనే ఉండిపోయింది. యుద్ధం కారణంగా ఇంకా అనుమతి రాలేదని సిబ్బంది చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్​ – ఇజ్రాయెల్​పై ప్రతిదాడులకు దిగుతోంది. అంతేగాకుండా అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులకు దిగొచ్చనే అనుమానాలున్నాయి. ఈ క్రమంలో లండన్(London)​కు వెళ్లాల్సిన విమానానికి ఇంకా క్లియరెన్స్​ రాలేదని సమాచారం. అయితే ప్రయాణికులు విమానంలోకి ఎక్కిన తర్వాత ఈ విషయం చెప్పడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండు గంటలుగా ఫ్లైట్​లో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ మేరకు సోషల్​ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...