- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిLingampet mandal | వంతెన పనులు వేగంగా నిర్వహించాలి

Lingampet mandal | వంతెన పనులు వేగంగా నిర్వహించాలి

- Advertisement -

అక్షరటుడే, లింగంపేట: Lingampet mandal | లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామ సమీపంలోని కేకేవై రహదారిపై (KKY road) గల పాములవాగు తాత్కాలిక వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయని బీజేపీ మండలాధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్​ (Bollaram Krantikumar) అన్నారు. ఈ మేరకు ఎంపీడీవోకు సోమవారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ.. వంతెన కుంగిపోయి కామారెడ్డి – లింగంపేట – ఎల్లారెడ్డి నిజాంసాగర్​కు (Nizamsagar) బస్సుల రాకపోకలు నిలిచిపోయన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. వర్షం కురిసి 20 రోజులు దాటినా ఇప్పటివరకు తాత్కాలిక వంతెన పూర్తి చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. వెంటనే వంతెన పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News